← Back to news

నిండుకుండలా తోటపల్లి రిజర్వాయర్

By Bejjanki· 2h ago· Bejjanki, Bejjanki, Siddipet

భారీ వర్షాలతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిండింది. జలాశయం నుంచి మత్తడి దూకుతుండటంతో పరిసర ప్రాంతాల్లో జలకళ కనిపిస్తోంది. రిజర్వాయర్‌లోకి భారీగా నీరు చేరడంతో భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశం ఉందని రైతులు తెలిపారు. బోరుబావుల్లో నీటి లభ్యత పెరిగితే పంటల సాగుకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రిజర్వాయర్‌ నిండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More in Local