← Back to news

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కీలక సమావేశం

By DK· 1d ago
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కీలక సమావేశం

ప్రకాశం జిల్లా ఒంగోలు నగర మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళిత, బహుజన పార్టీలు, వివిధ సంఘాల ప్రతినిధులు ‘థర్డ్ ఫ్రంట్’ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. ఒంగోలు వీఐపీ రోడ్డులోని బీబీ టవర్స్‌లో కొండూరి విశ్వసేన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జై భీమ్‌రావ్ భారత్ పార్టీ, బీసీవై పార్టీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ, BSP తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రానున్న మేయర్, కార్పొరేటర్ ఎన్నికలకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు.

More in Local