వాడపల్లి వెంకన్నకు బంగారు హారం బహూకరణ

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భారీ బంగారు హారం సమర్పించారు. విశాఖపట్నానికి చెందిన మైత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తెల్ల శ్రీనివాసరావు, శ్రీలక్ష్మి దంపతులు 463.920 గ్రాముల బంగారు హారాన్ని ఆలయానికి బహూకరించారు. దీని విలువ సుమారు రూ.71.94 లక్షలు ఉంటుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. దాత కుటుంబసభ్యులు బంగారు హారాన్ని ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుకు అందజేశారు.




