← Back to news

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి.. జగన్ డిమాండ్!

By Nani Eluri· 1d ago· X

AP: ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్ల టైమ్‌లో వైసీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని, నామినేషన్ పేపర్లు చించేస్తున్నారని జగన్ ఆరోపించారు. పోలీసుల ముందే తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలపై దాడులు జరిగాయని అన్నారు. పులివెందులలో పోలీసులు కాల్పులు జరపడంపైనా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, కేంద్రం వెంటనే స్పందించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దాడులకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

More in AP