భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ సూచించారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, కాలువలు, చెరువుల వద్ద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నీటి ప్రవాహం ఉన్న రహదారులను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు.



