డ్యామ్ వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలి

మార్కాపురం జిల్లా గొట్టిపడియ డ్యామ్ వద్ద సందర్శకుల భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టును చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండగా.. నిర్ణీత ప్రాంతం వరకే అనుమతి ఉన్నప్పటికీ కొందరు ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. మంచినీటి ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలోకి కూడా సందర్శకులను అనుమతిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. డబ్బులు ఇస్తే నిబంధనలు పక్కన పెట్టి పై ప్రాంతాలకు పంపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



