ఆటలతోనే మైండ్ రీఫ్రెష్

TG : స్పోర్ట్స్ వల్ల మైండ్ ఫ్రెష్‌గా ఉండి మానసిక వికాసం కలుగుతుందని బూర్గంపహాడ్ MPDO జమలారెడ్డి చెప్పారు. మోరంపల్లిబంజర్ ZPHS స్కూల్‌లో మండల స్థాయి క్రీడా పోటీలను MEO యదుసింహరాజు, సర్పంచ్ సుభద్రలతో కలిసి ఆయన ప్రారంభించారు. U-14, U-17 విభాగాల్లో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, రన్నింగ్, లాంగ్, హైజంప్ పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ స్పోర్ట్స్ మీట్‌లో స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.



