జలదిగ్భందంలో కొప్పర గ్రామం
భారీ వర్షాలతో విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పర గ్రామం జలమయం అయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామం చుట్టూ ఉన్న వాగులు పొంగిపొర్లడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. ప్రధాన రహదారులు నీట మునగడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరి, ఇతర పంట పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామం అంధకారంలో ఉంది. రెవెన్యూ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.



