కాకరవాయిలో కనులపండువగా సద్దుల బతుకమ్మ

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ గూడూరు ఉపేందర్, పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ ఆటపాటలు, కోలాటాలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగను గ్రామస్తులంతా ఐక్యంగా జరుపుకున్నారు. ఆడపడుచుల ఆనందోత్సాహాల మధ్య వేడుకలు కనులపండువగా సాగాయి.




