పులి సంచారం భయం భయం.. హైఅలెర్ట్

AP: పోలవరం జిల్లా దేవిపట్నం మండలం గంగపాలెం విలేజ్‌లో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. స్థానిక కొండ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పులి మెడకు అమర్చిన రేడియోకాలర్ సిగ్నల్స్ ఆధారంగా, డ్రోన్ల సాయంతో దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులి సంచారంతో గండిపోచమ్మ టెంపుల్‌కు వెళ్లే రహదారులను అధికారులు క్లోజ్ చేశారు. గంగపాలెం చుట్టుపక్కల ఉన్న గిరిజన, మైదాన ప్రాంత గ్రామాల్లో అధికారులు హైఅలర్ట్ అనౌన్స్ చేశారు. ఎవరూ ఒంటరిగా అడవి వైపు వెళ్లకూడదని సూచించారు.


