అరకు ఏరియాలో బలమైన ఈదురుగాలులు
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పరిసర ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అల్పపీడనం తీరం దాటడంతో నాలుగు రోజులుగా కొనసాగిన ముసురు వాతావరణం కాస్త తెరిపిచ్చినా గాలుల తీవ్రత మాత్రం కొనసాగుతోంది. ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లను తాకడంతో లైన్లు ట్రిప్ అవుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు.



