కోతుల బెడద ముదురుతోంది.. నందిపేట్ టెన్షన్!

నిజామాబాద్ జిల్లా నందిపేట్ పట్టణంలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోందని హనుమాన్‌గల్లి యువత ఆందోళన వ్యక్తం చేసింది. కోతులు జనావాసాల్లోకి చొరబడటమే కాకుండా ఇళ్లలోకి ప్రవేశించి వస్తువులు చిందరవందరగా పడేస్తున్నాయని, మహిళలు, చిన్నారులు, వృద్ధులపై దాడి చేసి గాయపరుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యపై హనుమాన్‌గల్లి యువత నందిపేట సర్పంచ్ ఎర్రం లింగంకు వినతిపత్రం అందజేసి, కోతుల బెడదను నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరింది.



