డబ్బాలు తీశారు.. దుకాణాలు వదిలేశారు

TG: చిరు వ్యాపారుల డబ్బాలు తొలగించి.. పెద్ద దుకాణ సముదాయాలను మాత్రం వదిలేయడంపై రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణ కూడలి విస్తరణలో భాగంగా రహదారులపై ఆక్రమణలను జేసీబీలతో తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల డబ్బాలను తొలగించినా, పెద్ద వ్యాపారుల దుకాణ సముదాయాల వద్ద మార్కింగ్ చేసి వదిలేయడంపై చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





