నేషనల్ హైవేపై నాగుపాము ప్రత్యక్షం
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలోని National Highway- 44పై నాగుపాము ప్రత్యక్షమవడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రిలయన్స్ పెట్రోల్ పంపు ఎదురుగా రోడ్డుపైకి నాగుపాము రావడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆగిపోయారు. దీంతో సుమారు 15 నిమిషాల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. పాము రోడ్డు దాటి వెళ్లిన తర్వాత వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ఘటనతో వాహనదారులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు.



