భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డు

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి పోస్టు పరిధిలోని గంధాలవీధి గ్రామానికి వెళ్లే రోడ్డు భారీ వర్షాలకు దెబ్బతింది. రౌరింతాడా నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర గ్రామస్థులు రూ.5 లక్షల సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్న రహదారి కొట్టుకుపోయింది. రహదారితో పాటు కల్వర్టు కూడా దెబ్బతినడంతో గ్రామానికి రాకపోకలు తీవ్రంగా ఇబ్బందికరంగా మారాయి. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి రహదారి, కల్వర్టును పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.




