కంచరాం స్కూల్కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కంచరాం ZP హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి SGF రెజ్లింగ్ పోటీల్లో సత్తా చాటారు. అండర్-17 విభాగంలో 46 కేజీల ఫ్రీస్టైల్లో ఎస్. అపర్ణ రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం సాధించింది. 65 కేజీల ఫ్రీస్టైల్లో కె. లావణ్య 3వ స్థానం దక్కించుకుంది. ఈ విజయంతో పాఠశాలలో ఆనందం నెలకొంది. HM గౌరీ నాయుడు, PD తాలాడ దుర్గారావు, జిల్లా APTF అధ్యక్షుడు మజ్జి మదనమోహనరావుతో పాటు పలువురు విద్యార్థులను అభినందించారు.



