పరిశ్రమ నుంచి దుర్వాసన.. స్థానికుల ఫిర్యాదుపై విచారణ

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ బయో ఎనర్జీ పరిశ్రమపై వచ్చిన ఫిర్యాదుతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు భాగ్యలక్ష్మి, రవీందర్ పరిశ్రమ పరిసరాలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. పరిశ్రమ నుంచి వస్తున్న దుర్వాసనతో బెజ్జంకి, కోహెడ మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తిమ్మాపూర్ వార్డు సభ్యుడు మేకల శ్రీధర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.



