కర్నూలు అభివృద్ధికి నిధులివ్వాలి

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల ప్రకారం కర్నూలు జిల్లాకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర డిమాండ్ చేశారు. ఆస్పరి మండలం బిల్లేకల్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లాను పరిశ్రమల కేంద్రంగా మార్చి యువతకు ఉపాధి కల్పించాలని, పెండింగ్ నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా హక్కుల కోసం ప్రజలంతా పోరాడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొందరు నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



