← Back to news

ఉప్పొంగిన వాగులు.. పొగిరి-సిగడాం రాకపోకల బంద్!

By Jaddu Udaykiran· 16h ago· Pogiri, Rajam, Vizianagaram

విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరి జంక్షన్-జి.సిగడాం మధ్య రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గురువారం రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గం మీదుగా సుమారు 30 గ్రామాలకు రాకపోకలు సాగుతుంటాయి. శ్రీకాకుళం, రాజాం వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతి పెరగడంతో పోలీసులు, అధికారులు వాహనాలను అటువైపు వెళ్లకుండా నిలిపివేశారు.

More in Local