← Back to news

వరంగల్‌ జాతీయ సదస్సుకు భారీగా తరలిరావాలి

By Jp raj Jp raj· 19 Aug 2026
వరంగల్‌ జాతీయ సదస్సుకు భారీగా తరలిరావాలి

AP: సెప్టెంబర్‌ 9న వరంగల్‌లో నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్‌ జాతీయ స్థాయి సదస్సును విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. బాపట్ల మండలంలోని ప్యాట్సిన్‌పేటలో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించారు. నూతన మండల కమిటీల నిర్మాణం చేపట్టారు. మహాజన సోషలిస్టు పార్టీ బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షుడు బుడంగుంట్ల లక్ష్మీనరసయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు మల్లవరపు గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో MRPS, MSP, MSF నూతన మండల కమిటీలను ఏర్పాటు చేశారు.

More in Local