జలదిగ్భంధంలో శివాలయం.. నీటిలోనే అభిషేకం
విజయనగరం జిల్లా రేగిడి మండలం సిరివాడ (సంకిలి) వద్ద నాగావళి నది వరద నీటిలో ప్రాచీన శివాలయం మునిగిపోయింది. భారీ వర్షాలతో నది ఉధృతంగా ప్రవహించడంతో ఆలయంలోకి వరద నీరు చేరి గర్భగుడిలోని శివలింగం పూర్తిగా నీట మునిగింది. అయినప్పటికీ భక్తులు, అర్చకులు మోకాలి లోతు నీటిలోనే నిలబడి శివలింగానికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నీటిలోనే పూజలు చేస్తున్న దృశ్యాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు.



