బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న నీరు
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పిడుగురాయి గ్రామంలో భారీ వర్షాలకు వరద నీరు బ్రిడ్జిపైకి చేరింది. గురువారం రాత్రి కురిసిన వర్షాలతో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో బ్రిడ్జిపై ప్రయాణించవద్దని గ్రామస్తులు చెట్ల మొద్దులను అడ్డుగా పెట్టారు. స్థానిక ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, అటువైపు ఎవరూ వెళ్లవద్దని అధికారులు సూచించారు.



