← Back to news

భామినిలో ఏనుగుల భీభత్సం

By Prasad Udandarao· 4h ago· Parvathipuram Manyam
భామినిలో ఏనుగుల భీభత్సం

పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలోని సోలికిరి పంచాయతీ పరిధిలో ఏనుగుల సంచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. నల్లరాయిగూడ, వై.రేగిడి, ఇసుకగూడ, సన్నాయిగూడ, డోకులెగూడ గ్రామాల్లో ఏనుగులు పంటపొలాలు, పండ్ల తోటలను ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. ప్రతి ఏటా భారీగా ఆర్థిక నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల వల్ల పంటలతో పాటు తమ ప్రాణాలకూ ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల సంచారాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

భామినిలో ఏనుగుల భీభత్సం

More in Local