జలదిగ్భంధంలో సంగమేశ్వరుడు

విజయనగరం జిల్లా వంగర మండలం సంగాం గ్రామంలోని పురాతన సంగమేశ్వరస్వామి ఆలయం నాగావళి నది వరద నీటిలో మునిగిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ఆలయంలోకి వరద నీరు చేరి గర్భగుడిలోకి వచ్చింది. ఆలయం చుట్టూ నడుము లోతుకు పైగా నీరు ఉండటంతో పూజా కార్యక్రమాలు నిలిచిపోయాయి. భక్తులు ఆలయానికి రావద్దని ఆలయ కమిటీ కోరింది. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు తిరిగి ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు.



