← Back to news

15 గంటల కరంట్ ఇవ్వాల్సిందే: రైతులు

By BK· 1h ago· TG
15 గంటల కరంట్ ఇవ్వాల్సిందే: రైతులు

TG : సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలో విద్యుత్ కోతలను వ్యతిరేకిస్తూ రైతులు రోడ్డెక్కారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ఊరిలో ర్యాలీ తీసి, మెయిన్ సెంటర్‌లో నిప్పు పెట్టారు. డైలీ కరంట్ కోతల వల్ల పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. వ్యవసాయానికి కనీసం 15 గంటల పాటు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సైదాపూర్ పవర్ ఏఈకి వినతిపత్రం ఇచ్చారు.

More in TG