SIR ప్రక్రియను పూర్తి చేయాలి

TG : ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్, వివరాల్లో తప్పుల గుర్తింపుపై దృష్టి పెట్టాలని సూచించారు. అవసరమైన వారికి నోటీసులు ఇచ్చి సిటిజన్‌షిప్ సర్టిఫికెట్లు స్వీకరించాలని తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఫిర్యాదులను తీసుకొని, అక్టోబర్ 15 వరకు నోటీసులు ఇస్తామన్నారు. ప్రజలకు సహాయంగా గ్రామాలు, మున్సిపాలిటీల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశించారు.



