ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తుకు భరోసా: కలెక్టర్

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో వరి పొలాలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కామవరపుకోట, పాతూరు, రావికంపాడు ప్రాంతాల్లో రైతులతో మాట్లాడి పంట పరిస్థితి, యూరియా, DAP లభ్యతపై వివరాలు తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేయకుండా మినుములు, పెసర వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. వీటికి 80 శాతం రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తామన్నారు.



