పొంగిపొర్లుతున్న బురదకాలువ.. స్పాట్‌కి చేరుకున్న MLA

భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా శ్రీరంగపట్నం వద్ద బురదకాలువ పొంగిపొర్లుతూ రోడ్లపైకి వరద నీరు చేరింది. మన్యం ప్రాంతాల్లోని సూరంపాలెం, ముసిరిమిల్లి రిజర్వాయర్ల నుంచి నీరు రావడంతో కాలువ బాగా పెరిగింది. విషయం తెలిసిన వెంటనే రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ శ్రీరంగపట్నం చేరుకుని అధికారులతో కలిసి పరిశీలించారు. బాధిత ప్రజలను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.



