వికారాబాద్ రోడ్డుపై గుంతలు.. ఎప్పుడు ఏ ప్రమాదమో!
TG: వికారాబాద్ జిల్లాలో మోమిన్‌పేట్ నుంచి వికారాబాద్ వెళ్లే రోడ్డు గుంతలు, గతుకులతో నిండిపోయింది. దీంతో ఈ రోడ్డుపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో గుంతలు సరిగ్గా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశముందని ప్రజలు భయపడుతున్నారు. MLA, జిల్లా అధికారులు ఈ సమస్యపై స్పందించి, రోడ్డును బాగుచేయాలని కోరుతున్నారు.



