← Back to news

MVSR కాలేజీలో ప్రమాదం.. 12 మందికి గాయాలు

By Nani Eluri· 1d ago· Prabhanews

TG: హైదరాబాద్ నాదర్‌గుల్‌లోని MVSR ఇంజినీరింగ్ కాలేజీలో డాండియా ప్రోగ్రామ్ జరుగుతుండగా ప్రమాదం జరిగింది. ‘సంగమం–2026’ ఫెస్ట్‌లో లైటింగ్ సిస్టమ్ జనాలపై కూలిపోయింది. ఈ ఘటనలో 12 మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే కాలేజీ సిబ్బంది, తోటి విద్యార్థులు ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి మరియు సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ప్రమాదానికి కారణమేంటో పోలీసులు తెలుసుకుంటున్నారు.

More in TG