← Back to news

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు

By VGRAO· 1h ago· Peddapalli
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న దసరా వేడుకలకు పోలీస్ సెక్యూరిటీ పెంచుతున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రావణ దహనం, క్రాకర్ షో, సినీ కళాకారుల ప్రోగ్రామ్స్ ఉండటంతో పెద్ద సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉంది.ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పారు. వేడుకలు పూర్తయ్యే వరకు పోలీసులు అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.

More in Local