← Back to news

తాడు సాయంతో ప్రాణాలకు తెగించి రాకపోకలు

By Mohan· 1d ago· Rajam, Rajam, Vizianagaram
తాడు సాయంతో ప్రాణాలకు తెగించి రాకపోకలు

విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీలోని సారధి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నడుములోతు నీరు ప్రవహించడంతో రాజాం–సారధి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు వాగు వద్దే నిలిచిపోతుండగా, అత్యవసర పనుల కోసం వెళ్లేవారు తాడు సాయంతో గెడ్డను దాటుతున్నారు. ఆస్పత్రులు, పనుల కోసం వెళ్లాల్సిన ప్రజలు ప్రాణాలకు తెగించి ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More in Local