మంగళగిరిలో జాబ్ మేళా

మంగళగిరి ఆత్మకూరులోని నిర్మల ఫార్మసీ కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు వందలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు వచ్చారు. మంత్రి నారా లోకేష్ చొరవతో జరిగిన ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని, అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి గురువారం సాయంత్రం ఆఫర్ లెటర్లు అందజేయనున్నారు.





