కాలచక్ర రోడ్డుపై వరద ప్రవాహం

పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, అచ్చంపేట, అమరావతి, క్రోసూరు మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, చెరువులు, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదకూరపాడు, పరస ప్రాంతాల్లో కాలచక్ర రహదారిపైకి వరద నీరు చేరింది. నలువైపుల నుంచి నీరు రోడ్డు వైపు ప్రవహిస్తుండటంతో వాహనదారులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.



