← Back to news

దసరా సందడి.. పల్లెబాట పట్టిన జనం

By Prashanth· 1d ago
దసరా సందడి.. పల్లెబాట పట్టిన జనం

బతుకమ్మ, దసరా పండుగలకు హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు ప్రజలు వెళ్లడంతో.. MGBS, JBSతో పాటు ప్రధాన రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. రహదారులపై వాహనాల రద్దీ పెరగడంతో టోల్‌ ప్లాజాల దగ్గర వాహనాలు బారులు తీరాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేక పలువురు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోందని అధికారులు తెలిపారు.

More in Current Affairs