నర్సంపేటలో హైఅలర్ట్.. ప్రధాన కూడళ్లలో పోలీసులు
TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా పోలీసులు మూడోరోజూ పట్టణంలో విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.



