← Back to news

వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

By Ramesh Ch· 1d ago· Narsampet (Ct), Narsampet, Warangal
వరంగల్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

వరంగల్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. వాతావరణ శాఖ Orange Alert జారీ చేసిన నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవు వర్తిస్తుందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

More in Local