"డేటా సెంటర్ వద్దు".. థానేలో వ్యతిరేకత

విశాఖలోనే కాదు.. మహారాష్ట్ర, థానేలోని బల్కుమ్‌లో కూడా భారీ డేటా సెంటర్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక్కడ కరవు, నీటి కొరత బాగా ఉంది. దీనిపై 'వేకప్‌థానేకర్' యాక్టివిస్ట్ దయానంద్.. CM దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. డేటా సెంటర్‌కి సంబంధించి డాక్టర్ అనిల్ కాకోద్కర్ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకూ నిర్మాణం ఆపాలని కోరారు. థానే ప్రజలకు నీటి కోసం ట్యాంకర్లే దిక్కు. డేటా సెంటర్ వల్ల నీటి కొరత, సౌండ్, ఎయిర్ పొల్యూషన్, వేడి సమస్యలొస్తాయని వ్యతిరేకిస్తున్నారు.


