గుంతల రోడ్డు..ఇంకెన్ని ప్రాణాలు పోవాలి?

సంగారెడ్డి జిల్లా హత్నూరలో పాడైపోయిన రోడ్డును బాగు చేయాలని కోరుతూ గ్రామస్తులు ఇవాళ రాస్తారోకో చేశారు. దౌల్తాబాద్ నుంచి హత్నూర ఐటీఐ వరకు 8 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా గుంతలమయమైందని, రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే ఓ యువకుడు గుంతలో పడి చనిపోయాడని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

