← Back to news

శరత్‌కుమార్ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి

By DK· 23h ago
శరత్‌కుమార్ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చిన్న భీంపురం గ్రామానికి చెందిన జన్ని శరత్ కుమార్ రైలు ప్రమాదంలో మృతిచెందడంతో ఆయన కుటుంబాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం పరామర్శించారు. శరత్ కుమార్ నివాసానికి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

More in Local