స్టూడెంట్స్‌కు AI సాయం.. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే?

స్టూడెంట్స్ చదువుపై AI ప్రభావం ఎలా ఉంటుందో ప్రపంచ బ్యాంకు రిపోర్ట్ వెల్లడించింది. AI వాడకంతో హోంవర్క్ స్కోర్లు పెరుగుతున్నా, ఎగ్జామ్స్‌లో మాత్రం మార్కులు తగ్గుతున్నాయి. చైనాలో 7 నుంచి 12వ తరగతి స్టూడెంట్స్పై జరిగిన స్టడీలో AI వాడకం మొదలైన ఆరు నెలలకు హోంవర్క్ స్కోర్లు 18% పెరగ్గా, క్లాస్ పరీక్షల మార్కులు 20% తగ్గాయి. AIపై అతిగా ఆధారపడితే సొంతంగా ఆలోచించే శక్తి, రీజనింగ్, రైటింగ్ స్కిల్స్ దెబ్బతినే ప్రమాదం ఉందని రిపోర్ట్ హెచ్చరించింది.



