'ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలి'
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సరిత తిరుపతయ్య నివాసంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. 2023 నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులు ఆన్‌లైన్‌లో ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



