ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం సొవ్వ పంచాయతీలో వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను మాజీ సర్పంచ్ పొట్టంగి రాంప్రసాద్ పరిశీలించారు. దేముడువలస, కొరొంజిగుడ, మలింగవలస గ్రామాల్లో పర్యటించిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి, నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలతో ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలను అధికారులు వెంటనే గుర్తించాలని కోరారు. బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు, నష్టానికి తగిన పరిహారం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



