← Back to news

స్టూడెంట్ హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీ

By ARJUN· 1d ago· Gadwal (R)(Part), Gadwal, Jogulamba Gadwal
స్టూడెంట్ హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీ

జోగులాంబగద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్టూడెంట్ హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. గద్వాల ప్రభుత్వ ప్రాక్టీసింగ్ పాఠశాలలో అదనపు కలెక్టర్ నర్సింగరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు హెల్త్ కార్డులు అందజేశారు. విద్యార్థులకు నిర్వహించే ఆరోగ్య పరీక్షల వివరాలను కార్డుల్లో నమోదు చేస్తారని తెలిపారు. అవసరమైనప్పుడు చికిత్స అందించేందుకు ఈ హెల్త్ కార్డులు ఉపయోగపడతాయని చెప్పారు.

స్టూడెంట్ హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీ
స్టూడెంట్ హెల్త్ ప్రొఫైల్ కార్డుల పంపిణీ

More in Local