← Back to news

వరి పొలాలను పరిశీలించిన కలెక్టర్

By DK· 1d ago
వరి పొలాలను పరిశీలించిన కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో నారు అందుబాటులో లేని రైతులు ఎదజల్లే పద్ధతిలో నేరుగా వరి విత్తనాలు వేసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. అచ్చుతాపురం మండలం పెదపాడు, ఎం.జె.పురం గ్రామాల్లో కలెక్టర్ వరి పంట పొలాలను పరిశీలించారు. నారు, ఎదజల్లిన వరి పొలాలను పరిశీలించి వర్షాభావ పరిస్థితుల్లో పంటల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు. పొలాల్లో ఉన్న వర్షపు నీటిని వినియోగించుకుని నారు అందుబాటులో ఉంటే నాట్లు వేసుకోవాలని చెప్పారు. నారు లేకపోతే ఎదజల్లే పద్ధతిలో నేరుగా విత్తనాలు వేసుకోవాలని తెలిపారు.

More in Local