← Back to news

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం

By Bala· 2h ago· భువనగిరి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ త్యాగాలు చిరస్మరణీయమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. ఇవాళ ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో BC అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆమె చేసిన పోరాట స్ఫూర్తిదాయకమన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

More in TG