వినాయక నిమజ్జనం.. మద్యం దుకాణాలకు సెలవు!

జోగులాంబ గద్వాల జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 25న మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. గద్వాల, ఇటిక్యాల, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలతో పాటు ఎర్రవల్లి పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు సెప్టెంబర్ 25 ఉదయం 6 నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 6 వరకు మూసి ఉండాలని స్పష్టం చేశారు. శాంతియుతంగా నిమజ్జనం జరగాలంటే ప్రజలు, నిర్వాహకులు సహకరించాలని కలెక్టర్ కోరారు.



