← Back to news

మహిళా కౌన్సిలర్ల భర్తల ప్రమేయంపై విమర్శలు!

By Madhu· 19h ago· మేడ్చల్-మల్కాజ్‌గిరి
మహిళా కౌన్సిలర్ల భర్తల ప్రమేయంపై విమర్శలు!

మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని 24 వార్డులకు 12 స్థానాలు మహిళలకే కేటాయించారు. ఇక్కడ గెలిచింది మహిళలే అయినా, ప్రతి ఆఫీషియల్ ప్రోగ్రామ్‌లో మహిళా కౌన్సిలర్లతో పాటు వారి భర్తలు కూడా పాల్గొంటుండటంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రోటోకాల్‌తో సంబంధం లేకుండా భర్తలే ముఖ్య పాత్ర పోషిస్తున్నారంటూ ఇతర నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సాధికారత లభించాలంటే అధికారిక కార్యక్రమాల్లో మహిళా కౌన్సిలర్లకు స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

More in Local