← Back to news

నర్సంపేటలో గణేష్ శోభాయాత్ర

By srikanth thouti· 1d ago· Narsampet (Ct), Narsampet, Warangal

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 25వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన 15 అడుగుల భారీ మట్టి వినాయకుడి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టించిన గణనాథుడికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల మధ్య శోభాయాత్ర చేపట్టారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు. ‘గణపతి బప్పా మోరియా’, ‘మంగళ్ మూర్తి మోరియా’ నినాదాలతో నర్సంపేట వీధులు మారుమోగాయి.

More in Local