గ్యాస్ సిలిండర్ లీక్.. ఇద్దరికి స్వల్ప గాయాలు!

అన్నమయ్య జిల్లాలోని గాలివీడు మండలంలోని కేరళ స్కూల్ సందులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు పానీపూరి కోసం గ్యాస్ వెలిగించారు. సిలిండర్ లీక్ అవుతున్నట్లు గమనించలేదు. దీంతో పేలిపోయింది. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. 108 అంబులెన్స్‌లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణనష్టం లేదని స్థానికులు తెలిపారు.




